అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mirai Review హనుమాన్ చిత్రం తర్వాత తేజ సజ్జా Teja Sajja ప్రధాన పాత్రలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం Pan India film మిరాయ్. ఇందులో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్ర చేశాడు.
కథానాయికగా రితికా నాయక్ నటించింది. కీలక పాత్రల్లో శ్రియ, జగపతి బాబు తదితరులు కనిపించి సందడి చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది.. కథ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
నటీనటులు : తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్ శ్రీను
దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సంగీత దర్శకుడు : గౌర హరి
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
కథ:
కళింగ యుద్ధం Kalinga War అనంతరం తీవ్రమైన పశ్చాత్తాపంలో మునిగిపోయిన సామ్రాట్ అశోకుడు Emperor Ashoka, తనలోని దివ్యశక్తులను తొమ్మిది గ్రంథాల రూపంలో సంకలనం చేసి, ప్రపంచ నలుమూలలలోని తొమ్మిది మంది రక్షకులకి అందజేస్తాడు.
ప్రతి గ్రంథంలో ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది – అది లోకానికి శాపమా? శ్రేయస్సా? అనేది.. దానిని దేని కోసం వాడతారన్నదానిపై ఆధారపడుతుంది.
శతాబ్దాలు గడిచిన తరువాత ప్రస్తుత కాలంలో ఈ పవిత్ర గ్రంథాలను చేజిక్కించుకొని భగవంతుడిగా అవతరించాలనే మానసిక తాపత్రయంతో ఒక క్రూర వ్యక్తి మహావీర్ (మంచు మనోజ్) రంగంలోకి దిగుతాడు.
ఒక్కో గ్రంథాన్ని సేకరిస్తూ.. చివరకు తొమ్మిదో గ్రంథం కోసం అతడి వెతుకులాట మొదలవుతుంది. ఆ గ్రంథం ప్రస్తుతం అంబిక (శ్రియా శరన్) కాపాడుతుంటుంది.
కాగా, ఆ గ్రంథాన్ని రక్షించాల్సిన బాధ్యతను అంబిక తన కుమారుడు వేద (తేజ సజ్జ) చేతికి అప్పగిస్తుంది. ఇదిలా ఉండగా.. అనుకోకుండా అతడికి రామాయణ కాలానికి చెందిన మిరాయ్ అనే శక్తివంతమైన అస్త్రం చేజిక్కుతుంది.
అదే అతడిని సాధారణ వ్యక్తి నుంచి రక్షకుడిగా, యోధుడిగా మారుస్తుంది. వేద ఎలా ఈ మార్పును చవి చూశాడు? మహావీర్‌ను ఎదురించడంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? మహావీర్ గతంలో ఏం చేశాడు? మహావీర్ చేతుల్లోకి చివరకు ఆ తొమ్మిదో గ్రంథం వెళ్లిందా.. లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Mirai Review : నటీనటుల పెర్‌ఫార్మెన్స్
చిత్రంలో ఈ తరం కుర్రాడిగా, యోధుడిగా రెండు వేరియేషన్స్ లో కనిపించి సందడి చేశాడు తేజ సజ్జా. సాధారణ కుర్రాడి నుంచి యోధుడిగా మారే విషయంలో తన నటనతో ఎంతగానో మెప్పించాడు.
తల్లి గురించి, తన లక్ష్యం గురించి తెలుసుకునే సన్నివేశాల్లో తేజ నటన చాలా బాగుంది. తెరపై కనిపించిన ప్రతిసారి స్వాగ్, స్టైల్ తో ఆకట్టుకున్నాడు.
మంచు మనోజ్ కూడా తన లుక్‌తో పాటు నటనతోను ఆకట్టుకున్నాడు. హీరోకి తల్లిగా, కథలో కీలకమైన డివైన్ రోల్ చేసి మెప్పించింది శ్రియా శరణ్. రితికా నాయక్ నటన పరంగా మెప్పించింది.
కాకపోతే డైలాగులతో లిప్ సింక్ మ్యాచ్ కాలేదు. జగపతి బాబు, జయరామ్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయాడు. హీరో స్నేహితుడిగా ‘గెటప్’ శ్రీను నవ్వించడం, పోలీస్ పాత్రల్లో దర్శకులు కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా నటించి మెప్పించారు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్: సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సాలిడ్ ప్రాజెక్ట్ చేయొచ్చని నిరూపించింది మిరాయ్. యాక్షన్ పార్ట్ , విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు చాలా రిచ్‌గా ఉన్నాయి.
హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి మంచి సంగీతం అందించాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనే ఈ సినిమాకి కెమెరా వర్క్ కూడా అందించాడు.
తన వర్క్ ఇందులో స్టన్నింగ్ గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఇక కార్తీక్ దర్శకత్వ పనితీరు విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథ, గ్రాండ్ విజన్ అంతా కూడా బాగుంది.
తను అనుకున్నది బాగానే ప్రజెంట్ చేశాడు. అయితే కథనం కొన్ని చోట్ల ఇంకా బెటర్‌గా గ్రిప్పింగ్‌గా డిజైన్ చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
- కథ
- గరుడ ఎపిసోడ్స్
- శబ్ద గ్రంథం యాక్షన్ ఎపిసోడ్
- శ్రియ శరణ్ రోల్
- సంగీతం
మైనస్ పాయింట్స్:
- కథనం
- క్లైమాక్స్
Mirai Review : విశ్లేషణ:
మొత్తంగా చెప్పాలంటే, “మిరాయ్” టాలీవుడ్ నుంచి మరో వినూత్న, ప్రతిభావంతమైన ప్రయత్నంగా నిలిచిందని చెప్పొచ్చు. మైథలాజీ, హిస్టరీ, అడ్వెంచర్ డ్రామాలను ప్రేమించే ప్రేక్షకుల కోసం ఇది ఒక పక్కా ట్రీట్.
సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఉత్కంఠభరితమైన హై మూమెంట్స్, బలమైన భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. తేజ సజ్జ తన పాత్రలో కొత్త కోణాన్ని చూపించగా, మంచు మనోజ్ తన క్యారెక్టర్‌కి న్యాయం చేస్తూ తెరపై అలరించాడు. ఇద్దరిలోనూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుంది.
ఇదే సమయంలో, దర్శకుడు తన విజన్‌ను బలంగా ప్రదర్శిస్తూ, కథను కొత్త దారుల్లో నడిపించాడు. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో టెక్నికల్‌గా కూడా బాగా కుదిరిన సినిమా ఇది. బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 3.5/5