అక్షరటుడే, వెబ్‌డెస్క్: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
ముంబయి Mumbai (Lokmanya Tilak Terminus – LTT) నుంచి కరీంనగర్ వరకు (నిజామాబాద్ మీదుగా) నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 01067/01068 వారపు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్ల రాకతో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గనుంది.
festivals Special trains : మరో రాజధాని ఎక్స్‌ప్రెస్..
ఇంకో విశేషం ఏమిటంటే.. మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. కొత్త రాజధాని ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతున్నట్లు భారత్ రైల్వే Indian Railways ప్రకటించింది.
ప్రస్తుతం భారత్లో 25 రాజధాని ఎక్స్‌ప్రెస్ Rajdhani Express రైళ్లు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రారంభించబోయే రాజధాని ఎక్స్‌ప్రెస్ 26వది.
ఈ రైలు సైరాంగ్ (అయిజాల్, మిజోరాం) (Aizawl, Mizoram) – ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) Anand Vihar Terminal (Delhi) మధ్య నడవనుంది. 26వ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రాకతో ఈశాన్య భారత్ North East India నుంచి ఢిల్లీకి అనుసంధానం మరింత మెరుగుకానుంది.