అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Minister for Road Transport & Highways Nitin Gadkari) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులిస్తూ తనపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము నిర్ణయాలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం రాజకీయంగా తనపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.
న్యూఢిల్లీలో గురువారం (సెప్టెంబరు 11) జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (Society of Indian Automobile Manufacturers) 65వ వార్షిక సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనే ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ దుష్ప్రచారం చేస్తున్న పెట్రోల్ లాబీని తీవ్రంగా విమర్శించారు.
“లాబీలు ఉన్న ప్రతిచోట ఆసక్తులు ఉన్నాయి.. పెట్రోల్ లాబీ చాలా ధనవంతులు” అని కేంద్ర మంత్రి అన్నారు.
“సోషల్ మీడియాలో జరుగుతున్నది నాకు వ్యతిరేకంగా చేసిన చెల్లింపు ప్రచారం. సుప్రీంకోర్టు (Supreme Court) కూడా పిటిషన్ను తోసిపుచ్చింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని” వ్యాఖ్యానించారు.
Minister Nitin Gadkari | దేశానికి, రైతులకు ప్రయోజనం..
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దేశానికి, మన రైతులకు (Farmers) ఎంతో లబ్ధి చేకూరుతుందని గడ్కరీ తెలిపారు.
శిలాజ ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారాన్ని తగ్గించుకుని, ఆ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో (Indian economy) పెట్టడం మంచిదా.. కాదా? అని ప్రశ్నించారు.
శిలాజ ఇంధనాలకు ఇథనాల్ మంచి ప్రత్యామ్నయమని, అందుబాటు ధరలో స్వదేశంలో ఉత్పత్తి అవుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
మొక్కజొన్న నుంచి తీసే ఇథనాల్ వల్ల మన రైతులు రూ.45 వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇథనాల్ వినియోగం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు.