ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    BC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: BC bills | రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో (Kamareddy) నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ అమలు సభను విజయవంతం చేయడం కోసం గురువారం బీబీపీట, దోమకొండ, భిక్కనూరు మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్​ను నిబద్ధతతో అమలు చేస్తున్నామన్నారు. కులగణనలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు (BJP and BRS leaders) పాల్గొనలేదన్నారు. సోషల్ ఇంజినీర్, సోషల్ జస్టిస్ జరగాలని బీసీలకు పదవులు ఇచ్చామన్నారు. బీసీలంతా కంకణబద్ధులై సభకు తరలిరావాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.

    వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదలకు ఇల్లు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మహిళలను కోటీశ్వరులను చేయాలని ఎన్నో కొత్త పథకాలు తీసుకువస్తూ మహిళా క్యాంటీన్లు, మహిళలకు బస్సులు, పెట్రోల్ బంకుల ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.

    ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, ఉచిత కరెంట్ అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, మహిళలకు ఫ్రీబస్ పథకాన్ని (free bus scheme) అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకేసారి రూ.9 వేల కోట్లతో రైతులకు రైతు భరోసా అందించామని, 50 వేల మంది ఉద్యోగాలు ఇచ్చామన్నారు. యూరియా (Urea) అందించే బాధ్యత కేంద్రానిదని, తాము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎలాంటి కొరత ఏర్పడకుండా రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నామని తెలిపారు.

    సోషల్ మీడియా వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారన్నారు. కొందరు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ మన మధ్య గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. దేవుడు గుడిలో ఉండాలని, మతం, భక్తి గుండెల్లో ఉండాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) ఈనెల 15న నిర్వహించే సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.

    BC bills | కార్యకర్తల పోరాటంతోనే అధికారం

    రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల పదేళ్ల పోరాటం, వారి కష్ట ఫలితమేనని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ తన నివాసంలోనే జరిగిందని, కామారెడ్డి పట్టణంలోనే డిక్లేర్ చేశారని, అమలు విజయోత్సవ సభ కూడా కామారెడ్డిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సభను విజయవంతం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...