అక్షరటుడే, డిచ్పల్లి: Bajireddy Govardhan | మండలంలోని ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ లక్కవత్రి నారాయణ (Lakkavatri Narayana) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (former rural MLA Bajireddy Govardhan) మిట్టపల్లి గ్రామంలో నారాయణ ఇంటికి వెళ్లారు.
ఆయన మృతదేహాం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి, మనోధైర్యాన్నిచ్చారు. నారాయణతో తనకు ఉన్న సత్సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాజిరెడ్డి వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, మండల నాయకులు దాసరి లక్ష్మీ నర్సయ్య, శక్కరికొండ కృష్ణ, పద్మారావు, ఒడ్డం నర్సయ్య, అంజయ్య, యూసుఫ్, అన్నం సాయిలు, బాదావత్ శంకర్ నాయక్, అశోక్ కుమార్, భానోత్ గోపాల్ నాయక్ తదితరులున్నారు.