ePaper
More
    HomeజాతీయంRashtrapati Bhavan | ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. రాష్ట్రపతి భవన్ వేదికగా కార్యక్రమం

    Rashtrapati Bhavan | ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. రాష్ట్రపతి భవన్ వేదికగా కార్యక్రమం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashtrapati Bhavan | ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికారులు తెలిపారు.

    రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (Prime Minister Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా (Union Ministers Amit Shah), రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు ఎన్డీయే పక్షాల నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) గురువారం సాయంత్రమే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

    Rashtrapati Bhavan | ఘన విజయం..

    జూలై 21న అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ (Jagdeep Dhankhar) ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన రాజీనామా చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్​ను బరిలోకి దించింది. మరోవైపు.. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమి తెలంగాణకు (Telangana) చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని (Justice Sudarshan Reddy) నిలబెట్టింది.

    మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential election) 67 ఏళ్ల రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవిని వదులుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్​కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...