అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం రేంజ్ బౌండ్‌లో కొనసాగింది. అయితే ఇంట్రాడే(Intraday) కనిష్టాలనుంచి బలంగా పుంజుకుని ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. భారత్, యూఎస్ మధ్య వాణిజ్య చర్చల విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుండడం ఇన్వెస్టర్లలో ఆందోళనను తగ్గించింది.
గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 208 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. వెంటనే కోలుకుని లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 81,216 నుంచి 81,642 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,940 నుంచి 25,037 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 81,548 వద్ద, నిఫ్టీ(Nifty) 32 పాయింట్ల లాభంతో 25,005 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | మిశ్రమంగా సూచీలు..
బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ 0.59 శాతం పడిపోగా.. క్యాపిటల్ మార్కెట్ 0.52 శాతం, ఆటో 0.32 శాతం నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.19 శాతం పెరగ్గా.. పవర్ 1.06 శాతం, ఎనర్జీ 0.96 శాతం, యుటిలిటీ 0.95 శాతం, పీఎస్‌యూ 0.86 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.76 శాతం, ఇన్‌ఫ్రా 0.74 శాతం లాభపడ్డాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం నష్టంతో ముగిసింది.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,094 కంపెనీలు లాభపడగా 2,022 స్టాక్స్ నష్టపోయాయి. 165 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 113 కంపెనీలు 52 వారాల గరిష్టాల(52 weeks high) వద్ద ఉండగా.. 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 1.69 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.56 శాతం, పవర్‌గ్రిడ్ 1.33 శాతం, ఎటర్నల్ 1.17 శాతం, ఎయిర్‌టెల్ 1.17 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.51 శాతం, టైటాన్ 1.09 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.85 శాతం, హెచ్‌యూఎల్ 0.84 శాతం, బీఈఎల్ 0.76 శాతం నష్టపోయాయి.