ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం కార్పొరేషన్ కార్యాలయం(Corporation Office)లో సమావేశం నిర్వహించారు.

    నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫైళ్లను తనిఖీ చేసి పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎల్​ఆర్​ఎస్(LRS)​ రుసుము చెల్లించిన వారికి తొందరగా క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

    Municipal Corporation | కార్పొరేషన్​ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు..

    మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు జరిగాయి. రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఒకరు రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా దొరికారు. దీంతో కార్పొరేషన్​ కార్యాలయంలో అవినీతిపై సర్వత్రా చర్చ జరిగింది. దీంతో కలెక్టర్(Collector Vinay Krishna Reddy)​ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...