అక్షరటుడే, ఇందల్వాయి: Ball badminton coaching | ఇందల్వాయి (Indalwai) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ (Badminton Coaching Camp) ప్రారంభమైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ గురువారం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ శిక్షణలో విద్యార్థులు మెళకువలు నేర్చుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటరామిరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీనాథం, ఫిజికల్ డైరెక్టర్ భూపతి రాజేశ్వర్, ఉపాధ్యాయులు గోపి, శ్యాంరావు, గ్రామ యువకులు శేఖర్, సత్యనారాయణ, చంద్రప్రకాష్, క్రీడాకారులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.