అక్షరటుడే, బోధన్ : Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిరుపేదలకు ప్రాధాన్యతనివ్వాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మండలంలోని పెంటాకుర్దు (Pentakurdu)లో కొనసాగుతున్న ఇందిరమ్మ సర్వే (Indiramma Survey)ను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీవో మధుకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు.
