అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కార్డు కోసం రూ.40 దరఖాస్తు ఫీజు వసూలు చేయగా, ఇకపై ఫీజు మినహాయింపు ఇచ్చింది. అంటే, సీనియర్ సిటిజన్లు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు.
ఇది ఎవరికీ లభ్యం?
* 60 ఏళ్లు నిండిన పురుషులు
* 58 ఏళ్లు పూర్తయిన మహిళలు
వారందరికీ ఈ సీనియర్ సిటిజన్ కార్డు (Senior Citigen Card) లభిస్తుంది. ప్రస్తుతం ఈ కార్డును డిజిటల్ రూపంలో అందజేస్తున్నారు. అయితే కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ కార్డులు జారీ చేస్తుండగా, ఇటీవల దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంతో గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు ఈ లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామని, సమస్యలు క్లియర్ అయిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
సీనియర్ సిటిజన్ కార్డుతో అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి:
* ఆర్టీసీ బస్సులలో 25% రాయితీ
* బ్యాంకింగ్ సేవలు, పన్ను మినహాయింపులు
* ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం
* ఆరోగ్య పరిరక్షణ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 70 ఏళ్లు పైబడిన వారికి ఆదాయం సంబంధం లేకుండా సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందుతుంది.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?
* గ్రామ/వార్డు సచివాలయాలు
* మీ సేవా కేంద్రాలు
* ఇంటర్నెట్ సెంటర్లు
* లేదా అవగాహన ఉంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే సమయంలో కావలసిన డాక్యుమెంట్స్:
* వయసు ధృవీకరణ పత్రం
* ఆధార్ లేదా గుర్తింపు కార్డు
* ఫోటో
* బ్లడ్ గ్రూప్
* అడ్రస్ ప్రూఫ్
* ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు
* బ్యాంక్ అకౌంట్ వివరాలు
అలాగే జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయాల్లో కూడా ఈ కార్డు జారీ అవుతుంది. వృద్ధులు మాత్రం ఈ కార్డును నేరుగా ఇంటికే పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు.