ePaper
More
    Homeబిజినెస్​Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. రెండు సెషన్ల పాటు మార్కెట్‌ను ముందుకు నడిపించిన ఐటీ సెక్టార్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపిస్తోంది.

    గురువారం ఉదయం సెన్సెక్స్‌ 208 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. వెంటనే కోలుకుని లాభాల బాట పట్టాయి. సూచీలు ఒడిడుకులకు లోనవుతూ రేంజ్‌ బౌండ్‌లో సాగుతున్నాయి. సెన్సెక్స్‌ 81,216 నుంచి 81,583 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,940 నుంచి 25,008 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 15 పాయింట్ల నష్టంతో 81,408 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 24,966 వద్ద ఉన్నాయి.

    ఐటీ, ఆటో సెక్టార్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌..

    ఐటీ, ఆటో సెక్టార్‌ల షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking) కనిపిస్తోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.82 శాతం పడిపోగా.. క్యాపిటల్‌ మార్కెట్‌ 0.53 శాతం, ఆటో 0.42 శాతం, రియాలిటీ 0.24 శాతం నష్టాలతో సాగుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.54 శాతం పెరగ్గా.. ఎనర్జీ 1.28 శాతం, పవర్‌ 1.16 శాతం, యుటిలిటీ 1.15 శాతం, పీఎస్‌యూ 1.06 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.91 శాతం, ఇన్‌ఫ్రా 0.88 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.72 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.37 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.08 శాతం లాభాలతో ఉన్నాయి.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎన్టీపీసీ 1.90 శాతం, ఎటర్నల్‌ 1.28 శాతం, అదాని పోర్ట్స్‌ 0.99 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.81 శాతం, సన్‌ఫార్మా 0.57 శాతం లాభాలతో ఉన్నాయి.

    Top Losers : ఇన్ఫోసిస్‌ 1.51 శాతం, టైటాన్‌ 0.84 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.78 శాతం, టెక్‌ మహీంద్రా 0.66 శాతం, ట్రెంట్‌ 0.52 శాతం నష్టంతో ఉన్నాయి.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...