ePaper
More
    HomeతెలంగాణSadabaiNama regularization | రైతులకు గుడ్​న్యూస్​.. సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్​.. 9.89 లక్షల మందికి ప్రయోజనం

    SadabaiNama regularization | రైతులకు గుడ్​న్యూస్​.. సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్​.. 9.89 లక్షల మందికి ప్రయోజనం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: SadabaiNama regularization : అప్రకటిత భూమి లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సాదాబైనామా అవకాశం కల్పించింది. తద్వారా సాగు భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే మార్గం సుగమమైంది.

    గతంలో భూమి క్రయవిక్రయాలు కేవలం తెల్ల కాగితాలపై జరిగేవి. వీటినే సాదాబైనామాలుగా పేర్కొంటారు. వీటికి చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు కాదు. దీనికితోడు భద్రత కూడా కరవయ్యేది.

    కాగా, నవంబరు 10, 2020 వరకు సాదాబైనామా Sadabai Nama దరఖాస్తులను ఆన్‌లైన్​లో స్వీకరించారు. కానీ ఆర్.ఓ.ఆర్. చట్టంలో ఈ అంశాన్ని పొందుపర్చకపోవడంతో హైకోర్టు స్టే ఇచ్చింది.

    SadabaiNama regularization : స్టే ఎత్తేసిన హైకోర్టు..

    ఫలితంగా సుమారు 9.89 లక్షల మంది కర్షకుల దరఖాస్తులు నిలిచిపోయాయి. కాగా, సమస్యను నిశితంగా పరిశీలించిన హైకోర్టు High Court తాను విధించిన స్టేను ఎత్తివేసింది.

    ఫలితంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే సాదాబైనామా క్రమబద్ధీకరణకు తెలంగాణ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    దీనివల్ల సాదాబైనామా దరఖాస్తుదారులకు లబ్ధి కలగనుంది. దాదాపు 11 లక్షల ఎకరాలకు 13-బీ ప్రొసీడింగ్స్‌ జారీ కానుంది. ఇదే జరిగితే లక్షల మంది కర్షకుల భూమి లావాదేవీల కష్టాలు తీరనున్నాయి.

    సాదాబైనామా క్రమబద్ధీకరణ జరిగితే.. సదరు రైతుల భూమి (agricultural lands) కి చట్టబద్ధత లభిస్తుంది. కర్షకులు బ్యాంకు రుణాలు పొందొచ్చు.

    భూమి విక్రయం, రక్షణ, వారసత్వం సమస్యలు తొలగిపోతాయి. భూమి రికార్డులు పారదర్శకంగా మారతాయి. దళారుల జోక్యం తగ్గుతుంది.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి పీక్కొని తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూ(Safari World Zoo)లో భయానక సంఘటన...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...