అక్షరటుడే, వెబ్డెస్క్: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup తొలి మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సొంతం చేసుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) లో బుధవారం (సెప్టెంబరు 10) యూఏఈతో మ్యాచ్ జరిగింది.
కాగా, ఈ మ్యాచ్లో టీమిండియా Indian team ఆటగాళ్లు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. భారత్ జట్టు ధాటికి ఆతిథ్య జట్టు ఘోర పరాభవం చవిచూసింది.
Asia Cup Cricket : ఒక వికెట్ నష్టానికి
బౌలింగ్లో మొదట భారత్ Team India చెలరేగింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి ఆతిథ్య జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని అవలీలగా ఛేజించింది.
యూఏఈ మొదట బ్యాటింగ్ చేసింది. యూఏఈ పేలవమైన ఆటతీరుతో 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య జట్టు.
ఇక తర్వాత బరిలోకి దిగిన టీమిండియా జట్టు 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి నల్లేరుపై నడకలా విజయం అందుకుంది.