అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది నిజామాబాద్ జిల్లా కోర్టు (Nizamabad District Court).
భార్యను శరీరకంగా, మానసికంగా వేధించి కత్తితో గాయపరిచి, హత్యాయత్నం చేసిన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ Nizamabad Assistant Sessions Judge Sai Sudha తీర్పునిచ్చారు.
attempted to murder : అసలేం జరిగిందంటే..
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని అంబేడ్కర్ కాలనీలోని తురేకార్ రాజమణికి 2018 లో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన సోన్ కాంబ్లె యాదవ్‌తో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఒక కూతురు ఉండేది. కానీ, అనారోగ్యంతో ఆ బాలిక మృతి చెందింది. ఇక సోన్ కాంబ్లె ఏ పనిచేసేవాడు కాదు. భార్య సంపాదన మీద ఆధారపడేవాడు మద్యం తాగుతూ జల్సాలు చేసేవాడు.
రాజమణి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. కాగా, మే 27, 2021న ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రాజమణి దగ్గరకు కాంబ్లె వచ్చాడు. తనతో రావాలని గొడవకు దిగాడు.
కానీ, అతడితో వెళ్లేందుకు రాజమణి ససేమిరా అంది. దీంతో తనతో రమ్మంటే రావా.. అంటూ వెంట తెచ్చుకున్న కత్తితో రాజమణి మేడ కోసి గాయపర్చాడు.
తీవ్ర రక్తస్రావం అవుతున్న రాజమణికి తోటి సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించిన పోలీసులు.. వాటిని కోర్టుకు నివేదించారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. ముద్దాయిపై నేరారోపణ రుజువైనట్లు నిర్దారిస్తూ భారత శిక్షాస్మృతి Indian Penal Code సెక్షన్ 307 ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో నెల రోజుల జైలుశిక్ష విధించాలని న్యాయమూర్తి సాయిసుధ తీర్పులో పేర్కొన్నారు.