అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpalli | కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు. మండలంలో గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
ఓ వైపు విధులు నిర్వహిస్తునే సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గతేడాది జరిగిన సీఎం కప్ (CM Cup) పోటీల్లో రూ.15వేల విలువైన మెమోంటోలు, టెన్నిస్ సింథటిక్ మ్యాట్, రూ.10 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్లను అందజేశారు. అంతేగాక కమ్మర్పల్లి యువకులతో ప్రతి రోజు క్రికెట్ ఆడుతూ క్రీడలపై అవగాహన కల్పిస్తూ.. గంజాయికి దూరంగా ఉండేలా చూస్తున్నారు.
మండలంలో ఎక్కడ ఏం జరిగినా.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మండల ప్రజలతో మమేకమై ప్రజల అభిమానాన్ని చురగొంటున్నారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు.
కొన్ని రోజులుగా బషీరాబాద్, కోనసముందర్ మార్గంలో రోడ్డుపై చెట్టు పడి ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎస్సై బుధవారం తన సిబ్బందితో కలిసి తొలగించారు. విధి నిర్వహణతో పాటు, సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తున్న అనిల్ రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.