అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న సేవలకు డివిజన్ ప్రజలు, ప్రయాణికులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. బుధవారం శర్భతి కెనాల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కూలీల్లా పనులు నిర్వహించారు.
ఇటీవల వర్షాలకు బోధన్ పట్టణంలో (Bodhan town) రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. గుంతలను పూడ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల సేవలపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.