ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిEx Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులను ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోలేదని, రైతులంటే సీఎంకు, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

    ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి (YellaReddy constituency) వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) రైతులను పరామర్శించకుండా విహారయాత్రకి వచ్చి వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగిందన్నారు. ప్రత్యేక నిధులతో ప్యాకేజీ ఇస్తారనుకుంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రెండు, మూడురోజుల్లో ప్యాకేజీ ప్రకటించకపోతే నియోజకవర్గ రైతులతో కలిసి బీసీ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

    పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయాలని, వరదలో బోరు మోటార్లు కొట్టుకుపోయిన రైతులకు కొత్త మోటార్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ముదాం సాయిలు, కపిల్‌ రెడ్డి, ఏగుల నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్‌ గౌడ్, పృథ్విరాజ్, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...