అక్షర టుడే, ఆర్మూర్: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని ఆరోపించారు.
గణేశ్ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా ఆర్మూరులో యువకులు డీజేలతో మళ్లీ కేసీఆరే రావాలి, కారే రావాలి అని పాటలు వింటూ డ్యాన్స్ చేస్తే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పాటలు (KCR Songs) వింటే పోలీసులకెందుకు అభ్యంతరమని నిలదీశారు. దళిత యువకుడు రోహిత్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి రెండు రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని, అతని కుటుంబ సభ్యులు విలపిస్తున్నా పోలీసులకు కనికరం లేదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా పోలీసు అధికారులు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా (Congress workers) మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jeevan Reddy | అధికార పార్టీ అండతో జూదం..
ఆర్మూర్‌లో అధికార పార్టీ అండదండలతో పేకాట క్లబ్‌లు జోరుగా నడుస్తున్నాయని, మట్కా, జూదం ఆడుతున్నా.. నల్లమట్టి అక్రమ రవాణా చేస్తున్నవారిని పట్టుకోని పోలీసులు, కేసీఆర్‌పై అభిమానం చూపిన వారిపై ప్రతాపం చూపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ (BRS) పదేళ్ల పాలనలో ఎన్నడూ అరాచకానికి చోటు లేదన్నారు. కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల పేర్లు పింక్ బుక్‌లో (Pink Book) ఎక్కిస్తున్నామన్నారు.
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని (KCR Government), కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్న వారి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. వెంటనే పోలీసు నిర్బంధంలో ఉన్న రోహిత్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోలీస్ స్టేషన్‌ను (Police Station) ముట్టడిస్తామన్నారు. అలాగే మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.