అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్మీ (Army) రంగంలోకి దిగడంతో అల్లర్లు సద్దుమణిగాయి.
అదే సమయంలో కొత్త ప్రభుత్వ (New Government) ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రభుత్వాన్ని పడగొట్టిన జెన్ జీ ఉద్యమకారులు.. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ (former Chief Justice Sushila Karky) నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈమేరకు సైన్యాధికారులతో జరిగిన చర్చల్లో ఆమె పేరును ప్రతిపాదించారు.
Nepal Govt | నిరసనకారులతో చర్చలు
దేశంలో పరిస్థితులు చేయి దాటడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మాండ్ (Kathmandu) సహా అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించింది. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఇక ఆందోళనలను విరమించి చర్చలకు రావాలని సైన్యం కోరింది. ఈ నేపథ్యంలో జెన్ జీ ప్రతినిధుల కీలక సమావేశం బుధవారం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి (restore law and order) నిర్వహించిన ఈ భేటీలో చర్చలు జరపడానికి ప్రతినిధులను ఎన్నుకున్నారు. 4,000 మందికి పైగా యువకులు వర్చువల్ గా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రభుత్వ నేతపై తీవ్ర చర్చ జరిగింది.
Nepal Govt | 31 శాతంమంది మద్దతు..
ఈ నేపథ్యంలో కార్కితో పాటు ఖాట్మండ్ మేయర్ బాలెన్ షా (Kathmandu Mayor Balen Shah) పేరు కూడా తెర పైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జెన్ జీ ప్రతినిధుల మధ్య ఓటింగ్ నిర్వహించగా, 31 శాతం సుశీల కార్కికి, షాకు 27 శాతం ఓట్లు వచ్చాయి. సైన్యంతో చర్చలు జరపడానికి ప్రతినిధులను ఎంపిక చేయడంతో పాటు తాత్కాలిక పరిపాలనకు కూడా నాయకత్వం వహించేందుకు కార్కి పేరును ఏకగ్రీవంగా నిర్ణయించారు.
వర్చువల్ సమావేశంలో, సుశీలా కర్కి 31 శాతం ఓట్లు పొందగా, ఖాట్మండు మేయర్ బాలెన్ షా 27 శాతం ఓట్లు పొందారు, దీనితో ఆమె ఇప్పటివరకు జనరల్-జెడ్ ఉద్యమ నాయకురాలిగా పరిగణించబడుతున్న షా కంటే ఆమోదయోగ్యమైన ఎంపికగా నిలిచింది.
Nepal Govt | సుశీలా కర్కి ఎవరంటే..
నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన సుశీలా కర్కి జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్ నగర్ లో జన్మించారు. మహేంద్ర మొరాంగ్ కళాశాల (Mahendra Morang College) నుండి పట్టా పొందిన ఆమె.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సొన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తరువాత నేపాల్లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం (ribhuvan University) నుంచి న్యాయ పట్టా పొందారు. జూలై 11, 2016 నుంచి జూన్ 6, 2017 వరకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన సుశీల అవినీతికి వ్యతిరేకంగా అనేక కీలక తీర్పులు వెలువరించారు.
పోలీసు నియామకాలలో అక్రమాలు, ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు ఉన్నత స్థాయి అవినీతి కేసులపై సంచలన తీర్పులు ఇచ్చి ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. అయితే, 2017లో రాజకీయ పార్టీలు ఆమెపై అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చాయి, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించాయి. అయితే, సుశీలకు మద్దతుగా ప్రజలు భారీ ఉద్యమం లేవదీయడంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నాయి.
Nepal Govt | జెన్ జీల కీలక నిర్ణయాలివే..
జెన్ జీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలతో (political parties) సంబంధం ఉన్న ఏ ఒక్కరూ నాయకత్వ చర్చలలో పాల్గొనకూడదని ఈ బృందం నొక్కి చెప్పింది. ఏ పార్టీతోనూ సంబంధం లేని పౌర కార్యకర్త సుశీలా కర్కిని చర్చల సమయంలో తటస్థంగా ఉండటానికి ఎంపిక చేశారు. మంగళవారం జరిగిన హింసలో చనిపోయిన వారిని అమరులగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.