ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు బీఎస్ రెడ్డి (BN reddy) పేర్కొన్నారు. వెంబో డయాబెటిక్ కేర్ (Vembo Diabetic Care) పీఎంపీ అసోసియేషన్ (PMP Association) ఆధ్వర్యంలో బుధవారం సుభాష్ నగర్​లో షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదిమందిలో ఆరుగురు షుగర్ వ్యాధిన పడుతున్నారని అన్నారు. తమను తాము అదుపులో ఉంచుకుంటూ వైద్యులు సూచించిన విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. ఎక్కువ ఆకుకూరలు పచ్చివి లేక ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి కంట్రోల్​లో ఉంటుందన్నారు.

    ఆకలి వేసినప్పుడల్లా కీర ముక్కలు, పల్చటి మజ్జిగ మధ్య మధ్యలో తీసుకోవాలన్నారు. ఉదయం సాయంత్రం వాకింగ్​తో పాటు వ్యాయామం చేస్తే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం మోహన్, నగర అధ్యక్షుడు సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...