అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ (college director Narala Sudhakar) ఒక ప్రకటనలో తెలిపారు.
ఇమార్టికస్ సహకారంతో హెచ్డీఎఫ్సీ, సిటీ యూనియన్, యాక్సిస్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో (ICICI Bank) శాశ్వత ప్రాతిపదికన పని చేసేందుకు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేలకు పైన జీతభత్యాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. 12న ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, ఏదైనా డిగ్రీ/ బీటెక్(Degree/B.Tech)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, 26 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.
వివరాలకు 9321825562 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.