Akkineni Sumanth | అక్కినేని హీరో పోయి పోయి ఆమెని వివాహం చేసుకోబోతున్నాడా..!
Akkineni Sumanth | అక్కినేని హీరో పోయి పోయి ఆమెని వివాహం చేసుకోబోతున్నాడా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్:Akkineni Sumanth | అక్కినేని ఫ్యామిలీకి మూల స్తంభం ఏఎన్ఆర్ కాగా, ఆయ‌న చివ‌రి ఊపిరి వ‌ర‌కు సినిమాల‌లో న‌టిస్తూ అలరించారు.

ఏఎన్ఆర్‌కి ఐదుగురు పిల్లలు వెంకట్, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, నాగార్జున. వీరిలో నాగార్జున, వెంకట్‌, నాగసుశీల పేర్లు అందరికీ తెలిసిందే. అక్కినేని నట వారసుడిగా నాగార్జున Nagarjuna తండ్రి పేరును నిలబెట్టగా.. వెంకట్ వ్యాపారాలు, సినీ నిర్మాణం చూసుకుంటున్నారు. నాగ సుశీల కూడా ప‌లు చిత్రాల‌కి నిర్మాత‌గా ఉన్నారు. ఇక అక్కినేని కుటుంబం మూడో తరం వార‌సులుగా సుమంత్, సుప్రియ, నాగచైతన్య, సుశాంత్, అఖిల్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో సుమంత్ మొద‌ట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అచ్చం తాత పోలిక‌ల‌తో ఉండే సుమంత్ స్టార్ హీరో(Sumanth Star Hero)గా ఎదుగుతాడ‌ని అంతా అనుకున్నారు.

Akkineni Sumanth | త్వ‌ర‌లో పెళ్లి

కాని సుమంత్ ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ అంతా డిస్ట్ర‌బ్ అయింది. సుమంత్(Sumanth) తొలుత ప్రేమకథ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు . తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహమంటే ఇదేరా, సత్యం, గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్ వంటి చిత్రాలతో సత్తా చాటారు. అయితే సుమంత్ Sumanth చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ కావ‌డంతో ఆయ‌న కెరీర్ పైకి వెళ్ల‌లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ రావా, నరుడా డోనరుడా సినిమాలో ట్రాక్‌లోకి వచ్చినట్లు అనిపించినా తిరిగి యథా ప్రకారమే అయ్యింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే తొలిప్రేమ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డి(Keerthi Reddy)తో ప్రేమలో ప‌డి ఆమెని వివాహం చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల‌కే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో విడిపోయారు.

ఇక అప్ప‌టి నుండి ఒంటరిగా ఉంటున్న సుమంత్ ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డార‌నే వార్త‌లు ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఓ స్టార్ హీరో కొడుకుతో చేసిన ప్రేమకథతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా(Pan India) సినిమాలో న‌టిస్తుంద‌ట‌. టాలీవుడ్ కాకుండా పూర్తిగా బాలీవుడ్‌కే Bollywood ప‌రిమితం అయింద‌ట‌. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌డ సుమంత్‌తో చాలా క్లోజ్ అయింద‌ని, అప్ప‌టి నుండి వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌నే టాక్ న‌డుస్తుంది. త్వ‌ర‌లో వీరు పెళ్లి కూడా చేసుకుంటార‌నే టాక్ న‌డుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.