అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ముప్కాల్ పోలీస్స్టేషన్ (Mupkal police station) పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా..ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Armoor Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. దీంతో విచారించిన న్యాయమూర్తి గట్టు గంగాధర్ ఇద్దరు వ్యక్తులకు రెండురోజుల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.