ePaper
More
    HomeజాతీయంMumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి...

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ అవతారమెత్తాడు. తన సోదరుడితో కలిసి అక్రమంగా ముంబై నేవీ యార్డులోకి (Mumbai Navy Yard) ప్రవేశించి ఇన్సాస్ రైఫిల్, బుల్లెట్లతో పరారయ్యాడు. దీంతో రంగంలోకి ముంబై ఏటీఎస్, ఎన్ఐఏ, ఇతర భద్రతా బృందాలు నేవీ కానిస్టేబుల్ తో పాటు అతడి సోదరుడ్ని అరెస్టు చేసి విచారిస్తున్నాయి.

    వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    అసలేం జరిగిందంటే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేశ్ 2023లో నావికాదళంలో అగ్నిపథ్ గా ఉద్యోగం సంపాదించాడు. 2025 ఫిబ్రవరి వరకు ముంబైలోని నేవీ యార్డులో విధులు నిర్వహించాడు. అనంతరం బదిలీపై కేరళ రాష్ట్రం (Kerala state) ఎర్నాకులంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

    Mumbai Navy Yard | బురిడీ కొట్టించి..

    అయితే రాకేశ్ తన సోదరుడు రాకేశ్ తో కలిసి ఆయుధాలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. సెప్టెంబర్ 6వ తేదీన యూనిఫామ్ లో ముంబైలోని నేవీ కేంద్రానికి (Navy center) వెళ్లాడు. తన సోదరుడు ఉమేశ్ సహకారంతో అక్కడి సెంట్రీ స్థలం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, 3 మ్యాగ్జిన్లు, 40 రౌండ్ల తూటాలు అక్రమంగా దొంగిలించారు. అనంతరం వీరు తమ స్వగ్రామమైన పెంచిల్ పేట్ మండలం ఎలకపల్లి కి చేరుకున్నారు.

    Mumbai Navy Yard | రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ పోలీసులు..

    నేవీ డ్రెస్ లో వచ్చి ఆయుధాలు తస్కరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై తక్షణమే స్పందించిన ముంబై క్రైమ్ పోలీసులు (Mumbai Crime Police) రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులు రాకేశ్, ఉమేశ్ గా గుర్తించారు. బుధవారం ఎలకపల్లికి వచ్చి సోదరులిద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి ఇన్సాస్ రైఫిల్, 3 మ్యాగ్జిన్లు, 40 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు మావోయిస్టులతో (Maoists) సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ ఘటనపై ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ (Asifabad District SP Kantilal Patil) స్పందించారు.“దేశ భద్రతకు సంబంధించిన ఆయుధాల దొంగతనం వంటి ఘటనలు అత్యంత తీవ్రమైన నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి”అని హెచ్చరించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...