ePaper
More
    HomeజాతీయంSupreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా ఉన్నామని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (Chief Justice of India BR Gavai) అన్నారు. బిల్లుల ఆమోదానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్ 12న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రపతి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.

    ఈ సందర్భంగా నేపాల్​లో (Nepal), గతేడాది బంగ్లాదేశ్(Bangladesh)లో జరిగిన హింసాత్మక నిరసనలను సుప్రీంకోర్టు గుర్తు చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్ నేపాల్ ఆందోళనల గురించి ప్రస్తావించారు. మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండని వ్యాఖ్యానించారు. “మన పొరుగు దేశాలలో ఏమి జరుగుతుందో చూడండి. నేపాల్​లో దారుణాలను చూశాము” అని చీఫ్ జస్టిస్ అన్నారు. అదే సమయంలో జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikram Nath) జోక్యం చేసుకుంటూ.. “అవును, బంగ్లాదేశ్ కూడా…” అని గత సంవత్సరం బంగ్లాదేశ్​లో జరిగిన దిగ్భ్రాంతికరమైన హింసను గుర్తు చేశారు.

    Supreme Court | రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది..

    ప్రజా ప్రాముఖ్యత కలిగిన లేదా ఏ విధంగానైనా ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే రాష్ట్రపతి హక్కును నిర్వచించే భారత రాజ్యాంగాన్ని (Indian Constitution) ప్రస్తావిస్తూ “మా రాజ్యాంగం పట్ల మేము గర్విస్తున్నాము” అని చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. “.. మన పొరుగు రాష్ట్రాలలో ఏమి జరుగుతుందో చూడండి. నేపాల్ ను చూస్తున్నాం కదా ” అని వ్యాఖ్యానించారు. జెన్ జడ్ నేతృత్వంలో నేపాల్​లో వెల్లువెత్తిన నిరసనలు అక్కడి ప్రభుత్వాన్ని కూలదోశాయి. అదే సమయంలో భారీ విధ్వంసం జరిగింది. మరోవైపు, బంగ్లాదేశ్ లో విద్యార్థుల నేతృత్వంలోని జరిగిన నిరసన అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనాను (Sheikh Hasina) గద్దె దింపింది.

    Supreme Court | ఆసక్తికర వాదన

    బిల్లులకు గడువు విధించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రపతి వేసిన్ పిటిషన్​పై (President petition) సుప్రీంకోర్టులో బుధవారం ఆసక్తికర వాదనలు జరిగాయి. దేశంలో ఎక్కడైనా నెల రోజుల లోపే 90 శాతం బిల్లులు గవర్నర్ల ఆమోదం పొందుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి డేటా మొత్తం తన వద్ద ఉందన్నారు. 1970 నుంచి మొన్నటివరకు కేవలం 20 బిల్లులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

    దీనిపై స్పందించిన జస్టిస్ నాథ్.. ఎన్ని బిల్లులు ఆమోదించడినా, మరెన్ని తిరస్కరణకు గురైనా దేశం గత 75 సంవత్సరాలుగా పని చేస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రధాన న్యాయమూర్తి గవాయ్ స్పందిస్తూ.. తాము గణంకాల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. “మేము గణాంకాలను తీసుకోలేము.. అది వారికి న్యాయం కాదు (రాష్ట్రపతి సూచనకు వ్యతిరేకంగా వాదించే రాష్ట్రం). మేము వారి గణాంకాలను తీసుకోలేదు. మీవి కూడా ఎలా తీసుకోగలం?… ముందుగా మీరే వారి గణాంకాలను వ్యతిరేకించారు కదా” అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.

    సొలిసిటర్ జనరల్ మెహతా వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లులలో దాదాపు 90 శాతం ఒక నెలలోపే గవర్నర్ ఆమోదం పొందుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 1970 నుండి 2025 వరకు.. గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆలస్యం చేసిన తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu government) ఆమోదించిన ఏడు బిల్లులతో సహా మొత్తం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని వివరించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడగట్టుకున్న తీవ్ర వ్యతిరేకత చట్టపరమైన సవాళ్లకు దారితీసిందని మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...