అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్ చంద్ర కొరడా ఝులిపించారు. వినాయక నిమజ్జనం (Vinayaka Nimajjanam) సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సై దత్తాద్రి గౌడ్‌ను (Rajampet SI Dattadri Goud) వేటు వేశారు. ఆయనను ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడంతో పాటు విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు హోంగార్డులను (Home Guards) సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రల్లో డీజేలకు (DJ Sounds) పోలీసులు అనుమతులు నిరాకరించారు. డీజేలు పెడితే వాటిని సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. అయినా పలు ప్రాంతాల్లో డీజేలు ఏర్పాటు చేశారు. అలాగే రాజంపేటలో కూడా పలువురు యువకులు డీజేలు ఏర్పాటు చేయగా వాటిని నిరోధించడంలో ఎస్సై నిర్లక్ష్యం వహించినట్లుగా ఉన్నతాధికారులకు సమాచారం అందింది.
ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఎస్సై దత్తాద్రి గౌడ్‌ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు (AR Headquarters) అటాచ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఎస్సై రాజుకు (SI Raju) రాజంపేటకు అటాచ్ చేశారు.
Kamareddy SP | ఇద్దరు హోంగార్డులు సైతం..
దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో (Devunipalli Police Station) పనిచేస్తున్న హోంగార్డు మొగులయ్యను ఎస్పీ సస్పెండ్ చేశారు. గతనెల 25 నుండి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుగా ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో స్వయంగా పాల్గొంటున్నారని అందిన నివేదిక ఆధారంగా మొగులయ్యను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అలాగే కామారెడ్డి గణేశ్ నిమజ్జన సమయంలో హోంగార్డు సత్యనారాయణ బందోబస్తు డ్యూటీకి నియమించారు. అయితే ఆయన విధులకు గైర్హాజరు అయ్యారని వచ్చిన నివేదిక ఆధారంగా సత్యనారాయణను విధుల నుండి సస్పెండ్ చేయడం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. విధులకు గైర్హాజరైనా.. శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా ప్రతిఒక్కరూ విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.