అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు తొలి రోజే దుమ్మురేపింది. ప్రైమరీ మార్కెట్లో షేర్లు అమ్మకానికి పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే బలమైన సబ్‌స్క్రిప్షన్‌ను (subscription) చూసింది.
ఇష్యూ మొదటి రోజు రెండు గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. NSE డేటా (NSE data) ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకే ఓవర్ సబ్ స్క్రిప్షన్ అయింది. రూ.1,900 కోట్ల విలువైన 10.67 కోట్ల షేర్లు విక్రయానికి పెట్టగా, తొలిరోజే 19.59 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
Urban Company IPO | ఫుల్ సబ్ స్క్రిప్షన్..
యాప్ ఆధారిత బ్యూటీ, హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం (home services platform) అయిన అర్బన్ కంపెనీ రూ.1900 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరుకు రూ.98 నుండి రూ.103 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధరలో కంపెనీ వాల్యుయేషన్ రూ.14,790 కోట్లుగా అంచనా వేయబడింది. 145 షేర్లతో కూడిన ఒక్కో లాట్ కు రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు.
మంగళవారం ప్రారంభమైన ఐపీవో గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తొలిరోజే ఇన్వెస్టర్ల భారీ స్పందన లభించింది. సంస్థాగతేతర పెట్టుబడిదారుల కోటా 2.04 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 4.52 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల భాగం 20 శాతం స్క్రిప్షన్ పొందింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.854 కోట్లు సేకరించింది.
Urban Company IPO | లాభాలు పంచనున్న ఐపీవో..
ఐపీవో బిడ్డింగ్ దాఖలు ముగింపునకు మరో రెండ్రోజులు గడువుంది. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎన్ఐఐలు, క్యూఐబీ కోటాలో (NIIs and QIB quota) మరింత సబ్ స్క్రిప్షన్ పెరుగనుంది. అర్బన్ కంపెనీ ఐపీవోకు (urban company IPO) ఫుల్ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లిస్టింగ్ గెయిన్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 15న షేర్ల కేటాయింపు పూర్తి కానుండగా, 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ కంపెనీ ఇది లిస్టింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గ్రే మార్కెట్ లో భారీగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఆరంభ లాభాలు దండిగానే వస్తాయన్న నమ్మకం కనిపిస్తోంది.