అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dilip Kumar) పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) బుధవారం 100 రోజుల కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారన్నారు.
నగరంలోని అన్ని డివిజన్లో శానిటేషన్ వర్క్ (Sanitation work), ప్యాచ్‌వర్క్‌లు, ఫాగింగ్ (Fogging) చేపట్టామన్నారు. సిబ్బంది బాధ్యతతో వ్యవహరించారన్నారు. అనంతరం అధికారులకు సిబ్బందిని సన్మానించారు. భవిష్యత్తులోనూ పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రవీందర్ సాగర్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఏఈలు, శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.