అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. బీహార్‌లో రూ.7,616 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు (infrastructure projects) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఇప్పటికే అనేక ప్రాజెక్టులను ఆమోదించింది. తాజాగా, రూ.4,447.38 కోట్ల విలువైన 82.4 కి.మీ. పొడవుతో బక్సర్-భాగల్పూర్ హై-స్పీడ్ కారిడార్లోని (Boxar-Bhagalpur high-speed corridor) నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ మోకామా-ముంగేర్ సెక్షన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Bihar | బక్సర్ నుంచి భాగల్పూర్కు కనెక్టివిటీ
బక్సర్ నుంచి భాగల్పూరు వరకు అనుసంధానించే మోకామా, బరాహియా, లఖిసరై, జమాల్పూర్, ముంగేర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలకు కొత్త రోడ్డు కనెక్టివిటీని (new road connectivity) అందిస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. “ఇది బక్సర్ నుంచి భాగల్పూర్ వరకు ఉన్న రూ. 4,447 కోట్లతో హైస్పీడ్ కారిడార్ నెట్ వర్క్ నిర్మాణానికి ఆమోదం లభించింది.
ఇది దక్షిణ బీహార్‌కు ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇందులో, బక్సర్ నుండి పాట్నాకు (Patna) వెళితే ఇప్పటికే మంచి నెట్వర్క్ ఉంది. పాట్నా నుంచి ఫతుహా వరకు, ఫతుహా నుంచి బెగుసరాయ్ వరకు ఈ ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తయింది. ఈ రోజు ఆమోదించబడిన విభాగం మోకామా నుంచి ముంగేర్, ముంగేర్ భాగల్పూర్ రోడ్డు విస్తరణ కారణంగా గంట ప్రయాణ సమయం ఆదా అవుతుంది” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Bihar | మూడు రాష్ట్రాలను అనుసంధించానించేలా..
దీనికి తోడు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ (West Bengal) మీదుగా వెళుతున్న 177 కిలోమీటర్ల పొడవైన భాగల్పూర్-డుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్‌ను డబ్లింగ్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ. 3,169 కోట్లు కేటాయించింది.
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లను అనుసంధానిస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ బీహార్ నుంచి ప్రారంభమై రాంపూర్‌హాట్‌లో పశ్చిమ బెంగాల్‌తో అనుసంధానించబడుతుంది. ప్రస్తుతం, భాగల్పూర్ (Bhagalpur) నుంచి మాల్డాచ రాంపూర్హాట్ మీదుగా హౌరాకు రైళ్లు నడుస్తాయి.