ePaper
More
    HomeజాతీయంAmit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్​ను...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్​ను విమర్శించిన బీజేపీ నేత

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్​లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) లాంటి నాయకుడు అవసరమని ఓ నేపాలీ యువకుడు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్​గా మారింది.

    ఈ వీడియోను బుధవారం షేర్ చేసిన బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా (BJP leader Amit Malviya లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నాయకుడి గురించి కాంగ్రెస్ పార్టీ (Congress Party) పెట్టిన అనేక వీడియోలను గుర్తు చేస్తూ మాల్వియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    “రాహుల్ గాంధీని జనరల్ జెడ్ “సెక్స్ సింబల్”గా చూపిస్తూ ఆయన తన అబ్స్ను ప్రదర్శిస్తూ, బైకులు నడుపుతూ, పుష్-అప్లు చేస్తూ లేదా డైవింగ్ చేస్తూ ఉన్న వెర్రి రీళ్లతో కాంగ్రెస్ అశ్లీలమైన డబ్బు ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. ‘‘కానీ వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశంలో లాగానే నేపాల్​లో జనరల్ జెడ్.. ప్రధాని మోదీ లాంటి నాయకుడిని, దార్శనికత, దృఢ నిశ్చయం, సామర్థ్యం ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నారని” అని మాల్వియా తెలిపారు.

    Amit Malviya | మోదీ లాంటి నేత కావాలంటున్న నేపాలీలు

    తమ దేశానికి మోదీ లాంటి నాయకుడు అవసరమని నేపాలీ యువకుడు చెబుతున్న వీడియోను మాల్వియా షేర్ చేశారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్నంటు వంటి ప్రభుత్వం ఉంటే నేపాల్ ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉండేది కాదు. నేపాల్ ముందంజలో ఉండేది…” అని అక్కడి యువత చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Andhra Pradesh Vice President Vishnuvardhan Reddy) కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, “నేపాల్ నుంచి యువ స్వరాలు ఒక భావాన్ని గట్టిగా, స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి – “మోదీ జీ లాంటి నాయకత్వం మనకు అవసరం”అని ఆయన పోస్టు చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...