అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్లో (Venu Mall) గల కేఎఫ్సీలో కుళ్లిన చికెన్ వచ్చిందంటూ ఓ కస్టమర్ సోషల్ మీడియాలో (Social Media) వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా కేఎఫ్సీలో తనిఖీలు చేపట్టారు.
కిచెన్‌లో దుర్వాసన రావడంతో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు తరలించారు. డ్రెయినేజీ మూసుకుపోవడం దుర్వాసన వెదజల్లడంతో నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయాని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత (Food safety inspector Sunitha) తెలిపారు. కుళ్లిన చికెన్‌పై వివరణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.