అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్(Trade deal) వైపు అడుగులు పడుతుండడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. ఐటీ(IT), పీఎస్‌యూ, బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల బాటలో సాగాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 25 వేల మార్క్‌ను మరోసారి దాటినా.. స్వల్పంగా తగ్గి 24,973 వద్ద నిలిచింది.
ఇన్ఫోసిస్ (Infosys) బైబ్యాక్ ప్రతిపాదన ఇచ్చిన జోష్‌తో ఐటీ సెక్టార్‌లో వరుసగా రెండోరోజూ పరుగులు తీసింది. దీనికి పీఎస్‌యూ స్టాక్స్ తోడవడంతో ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 403 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 81,235 నుంచి 81,643 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,915 నుంచి 25,035 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 81,425 వద్ద, నిఫ్టీ(Nifty) 104 పాయింట్ల లాభంతో 24,973 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | పీఎస్‌యూ బ్యాంక్స్‌లో కొనుగోళ్ల మద్దతు..
ఆటో సెక్టార్(Auto sector)లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించగా.. ఐటీతోపాటు పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఆయా ఇండెక్స్‌లు భారీగా పెరిగాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 2.52 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) 2.16 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.88 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.37 శాతం, పీఎస్‌యూ 1.29 శాతం, ఇండస్ట్రియల్ 1.20 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.15 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0. 72 శాతం, బ్యాంకెక్స్ 0.68 శాతం పెరిగాయి. ఆటో ఇండెక్స్ 1.21 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.22 శాతం, టెలికాం 010 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం లాభపడ్డాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,410 కంపెనీలు లాభపడగా 1,717 స్టాక్స్ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 118 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 2.10 లక్షల కోట్లమేర పెరిగింది.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 4.26 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.57 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.19 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.05 శాతం, టీసీఎస్ 1.99 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ఎంఅంద్‌ఎం 2.46 శాతం, మారుతి 1.53 శాతం, టాటా మోటార్స్ 0.91 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.60 శాతం, పవర్‌గ్రిడ్ 0.33 శాతం నష్టపోయాయి.