ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రేమ్ కుమార్ (Additional Collector Prem Kumar) సూచించారు.

    మాస్టర్ ట్రైనర్లుగా (Master Trainers) శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు ఆపదమిత్ర (Apadamitra) వలంటీర్లు బుధవారం జిల్లా కలెక్టరేట్​లో అదనపు కలెక్టర్​ను కలిశారు. జిల్లాలో 300మంది ఆపదమిత్ర వలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకోగా.. ఐదుగురిని మాస్టర్ ట్రెయినింగ్​ కోసం ఎంపిక చేసి బెంగళూరులోని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీలో 21 రోజులు మెరుగైన శిక్షణ అందించారు.

    జిల్లా నుంచి శిక్షణ పొందిన సురేఖ, జమున, రాజు, వెంకటేష్, సునీల్​లను అదనపు కలెక్టర్ అభినందించారు. ట్రెయినింగ్​ పూర్తి చేసుకున్న వలంటీర్లు మిగతా వలంటీర్లకు విపత్తు సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నివారించాలనే అంశాలపై మెళకువలు తెలపాలని సూచించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...