అక్షరటుడే, కామారెడ్డి: Chili’s Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేయాలని మాజీ సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య (Former CDC Chairman Ireni Narsaiah) అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని (Kamareddy) ఆర్ అండ్‌బీ గెస్టహౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం తనతో పాటు మరికొందరం పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్‌కు (Chili’s Bar and Restaurant) వెళ్లామన్నారు. అక్కడ తాము అడిగినవి ఇవ్వకపోవడంతో బార్ నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే బార్ మేనేజర్ లక్ష్మీపతి వచ్చి తమతో దురుసుగా మాట్లాడటమే కాకుండా తనపై దాడికి పాల్పడటానికి ప్రయత్నించాడన్నారు.
ఈ విషయమై పోలీసులకు తాను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసుల ముందే తనను బార్ నుంచి గెంటేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అలాగే బార్లో కుళ్లిన ఆహారం అందజేస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అడిగిన వారిపై దాడులకు పాల్పడటం సరికాదని, అధికారులు పూర్తి విచారణ చేపట్టి బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేయాలని కోరారు.