అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ పార్టీ(Congess Party) బుధవారం అభినందనలు తెలిపింది. అదే సమయంలో ఉప రాష్ట్రపతిగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరింది.
మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో(Vice President Elections) మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి బలపరిచిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఓడిపోయారు. ఈ క్రమంలో నూతన ఉప రాష్ట్రపతికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే(Mallikarjan Kharge) సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. “ఐక్య ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి ఉత్సాహభరితమైన, సూత్రప్రాయమైన పోరాటానికి ముందుకొచ్చారని ప్రశంసించారు.
Congress | వివక్ష చూపొద్దన్న జైరాం రమేశ్
మరోవైపు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్(Vice President Radhakrishnan) కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) అభినందనలు తెలిపారు. అదే సమయంలో మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు, “1952 మే 16న రాజ్యసభ ప్రారంభ రోజున ప్రముఖ తత్వవేత్త-విద్యావేత్త-రచయిత-దౌత్యవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలా అన్నారు. ‘నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, అంటే ఈ సభలోని ప్రతి పార్టీకి చెందినవాడిని. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యున్నత సంప్రదాయాలను నిలబెట్టడం, ప్రతి పార్టీ పట్ల న్యాయంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం నా బాధ్యత. ఎవరి పట్ల ద్వేషం లేకుండా సద్భావనతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తా. ప్రతిపక్ష సమూహాలు ప్రభుత్వ విధానాలను న్యాయంగా, స్వేచ్ఛగా. స్పష్టంగా విమర్శించడానికి అనుమతించకపోతే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగా దిగజారిపోయే అవకాశం ఉంది’,” అని రమేష్ Xలో పోస్ట్ చేశారు.