ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం పీడీఎస్​యూ (PDSU), టీయూసీఐ (TUCI) ఆధ్వర్యంలో ఘన్​పూర్​(Ghanpur)–డిచ్​పల్లి రోడ్డుపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.

    ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ.. డిచ్​పల్లి (Dicpally) మండలంలో ఘన్​పూర్​, ఇస్లాంపూర్​ నుంచి 60 మంది విద్యార్థులు మోడల్​ స్కూల్​లో చదువుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ బస్సు డిచ్​పల్లి మీదుగా అన్ని గ్రామాలు తిరిగి ఘన్​పూర్​కు వచ్చేసరికి సుమారు గంట ఆలస్యం అవుతోందన్నారు. దీంతో విద్యార్థులు నిత్యం తరగతులకు లేటుగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఘన్​పూర్​, ఇస్లాంపూర్​ మీదుగా మోడల్​ స్కూల్​ వరకు ప్రత్యేకంగా ఒక బస్సు నడపాలని డిమాండ్​ చేశారు. ఈ రాస్తారోకోలో పీడీఎస్​యూ నాయకులు కార్తీక్, బబ్లు, కీర్తన, అవంతిక, ఆదిశ్రీ, తేజు, మురళీధర్, నవతేజ, TUCI నాయకులు రాములు, అశోక్, ప్రవీణ్, రమేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ: గొర్ల కాపరితో సహా 20 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...