అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి (Chakali Ailamma death anniversary) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Kasula Balaraju) కలిసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ సేవలను కొనియాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు నార్ల సురేష్, ఎజాజ్, శ్రీనివాస్, గురు వినయ్, ఖాలెక్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.