ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో కస్టమర్లు షాక్​ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్​లో (Hyderabad) చోటు చేసుకుంది.

    నగరంలోని ముషీరాబాద్​లో (Musheerabad) గల అరేబియన్​ మండీ రెస్టారెంట్​లో బిర్యానీ తినడానికి కొంతమంది స్నేహితులు వెళ్లారు. అందరు కలిసి తింటుండగా.. బిర్యానీలో బొద్దింక (cockroach) రావడంతో వారు షాక్​ అయ్యారు. ఇదేమిటని రెస్టారెంట్​ నిర్వాహకులను ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాకుండా వారిని బెదిరించారు. దీంతో వారు రెస్టారెంట్​ ఎదుట ఆందోళన నిర్వహించగా.. పోలీసులు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​గా మారింది.

    Hyderabad | ఇష్టారాజ్యంగా..

    హైదరాబాద్​ బిర్యానీ (Hyderabad biryani) అంటే చాలా మంది లొట్టలు వేసుకుంటూ తింటారు. దీంతో నగరంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు వెలిశాయి. అయితే చాలా హోటళ్లలో నిర్వాహకులు శుభ్రత పాటించడం లేదు. కొన్ని హోటళ్లలో పాడయిపోయిన ఆహార పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. అంతేగాకుండా కిచెన్​లో శుభ్రంగా ఉంచడం లేదు. దీంతో ఎలుకలు, బొద్దింకలు (rats and cockroaches) తిరుగుతున్నాయి. గతంలో సైతం బిర్యానీలో బొద్దింకలు, ప్లాస్టిక్​ కవర్లు వచ్చిన ఘటనలు ఉన్నాయి.

    Hyderabad | చర్యలు కరువు

    నగరంలో ఫుడ్​ సేఫ్టి అధికారులు (Food safety officials) తనిఖీలు చేయడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకున్నా పట్టించుకోవడం లేదు.  తనిఖీలు చేసిన సమయంలో కుళ్లిన మాంసం, నకిలీ ఆహార పదార్థాలను గుర్తించిన కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో హోటల్​ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...

    Registrations | రిజిస్ట్రేషన్లలో జాప్యం.. తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన...