ePaper
More
    HomeసినిమాHit 3 Movie | నాని హిట్ 3 టీంకి ఇది పెద్ద షాకే.. ఆన్‌లైన్‌లో...

    Hit 3 Movie | నాని హిట్ 3 టీంకి ఇది పెద్ద షాకే.. ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hit 3 | నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) జంటగా రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ హిట్ 3 (HIT 3). శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్(Unanmis Productions) బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. చిత్రానికి మిక్కి జే మేయర్(Mickey Jay Meyer) సంగీతం అందించ‌గా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మే 1న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. చిత్ర బృందం కూడా గ్రాండ్‌గా సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. అయితే మూవీ హిట్ అయింద‌నే ఆనందం టీంకి ఎక్కువ సేపు మిగ‌ల‌లేదు.

    Hit 3 | ఇదెక్క‌డి స‌మ‌స్య‌..

    ‘హిట్ 3′(HIT 3) థియేటర్లలోకి వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఒరిజినల్ ఆడియోతో HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావ‌డం ఇప్పుడు క‌ల‌వ‌ర పెట్టిస్తుంది.. దీంతో మూవీ టీంతో పాటు నాని NANI ఫ్యాన్స్, సినీ ప్రియుల్లో ఆందోళన నెలకొంది. పైరసీ భూతాన్ని కట్టడి చేయాలని.. సినీ ఇండస్ట్రీని కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాల‌కి కూడా ఈ లీకుల స‌మ‌స్య ఎక్కువైంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఇలా లీకులు అవుతుండ‌డం నిర్మాత‌ల‌ని ఇబ్బంది పెడుతుంది.

    హిట్ 3(HIT 3) చిత్రం విడుద‌ల‌కి ముందే బుకింగ్స్‌లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలి రోజు మార్నింగ్ షోస్ దాదాపు 80 శాతం, మధ్యాహ్నం షోస్ 92 శాతం, ఈవినింగ్ షోస్ 91 శాతం ఆక్యుపెన్సీ (Occupancy) నమోదు చేశాయి.

    యూఎస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తానికి హిట్ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన హిట్ 3 చిత్రం కూడా సూప‌ర్ హిట్ అయింది. హిట్ 4లో(Hit 4) కార్తీ న‌టించ‌నున్న‌ట్టు మూవీ చివ‌ర్లో చెప్పుకొచ్చారు. హిట్ 3లో(Hit 3) రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వయలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని వైల్డ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...