అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Moneylaundering Case | కర్ణాటకకు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అక్రమ ఇనుప ఖనిజ ఎగుమతులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సైల్(MLA Satish Krishna Sail)ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఉత్తర కన్నడలోని కార్వార్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సైల్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోద చేసిన ఈడీ(ED).. మంగళవారం బెంగళూరు జోనల్ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Moneylaundering Case | కస్టడీకి అనుమతి
సతీష్ కృష్ణను అరెస్టు చేసిన ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. ఆయనను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఒకరోజు కస్టడీకి అనుమతించింది. ఆయనను మళ్లీ కోర్టులో హాజరుపరిచినప్పుడు కస్టోడియల్ రిమాండ్(Custodial Remand)ను పొడిగించాలని కోరాలని ఈడీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Moneylaundering Case | రెండో ఎమ్మెల్యే..
కర్ణాటక(Karnataka)లో అక్రమాలపై విచారణ చేపట్టిన ఈడీ అక్కడి ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తుండడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ దారి తీస్తోంది. వారాల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను ఈడీ అరెస్టు చేసింది. అక్రమ బెట్టింగ్‌కు సంబంధించిన ప్రత్యేక మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెందిన చిత్రదుర్గ ఎమ్మెల్యే కె సి వీరేంద్ర ‘పప్పీ’ని ఈడీ ఆగస్టులో అదుపులోకి తీసుకుంది. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే తాజాగా మరో ఎమ్మెల్యే సతీష్ కృష్ణను అరెస్టు చేసింది. ఆయనకు సంబంధం ఉన్న ఒక కంపెనీ అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసిందనే ఆరోపణలతో సెయిల్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆగస్టు 13-14 తేదీల్లో కార్వార్, గోవా, ముంబై, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు ఆయనను అరెస్టు చేసింది.