అక్షరటుడే, వెబ్డెస్క్ : Terrorists Arrest | ఉగ్రవాద నిరోధక చర్యల్లో భద్రతా దళాలు కీలక విజయం సాధించాయి. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు చేశాయి. భారత్‌లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అషర్ డానిష్ అనే ఐసీస్ ఉగ్రవాదిని బుధవారం రాంచీలో అరెస్టు చేశారు. అతడు బొకారో జిల్లా(Bokaro District)లోని పెట్వార్ కు చెందినవాడు.
ఢిల్లీలో నమోదైన కేసు నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ బృందం(Delhi Special Cell Team) చాలా కాలంగా అతని కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో అతడి కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్, జార్ఖండ్ ఏటీఎస్, రాంచీ పోలీసులు(Ranchi Police) సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రాంచీలోని ఇస్లాంనగర్(Islamnagar)లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రహస్య స్థావరానికి తరలించి విచారిస్తున్నారు.
అదే సమయంలో ఢిల్లీలో మరో ఐసిస్ ఉగ్రవాదిని(ISIS Terrorist) కూడా అరెస్టు చేశారు. అఫ్తాబ్ అనే వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 12 చోట్ల ప్రత్యేక బృందాలు, కేంద్ర బలగాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మొత్తం 8 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశముంది.