అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సూరజ్రావు (22) అనే యువకుడు తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది.
Indur : అటవీశాఖ అధికారి..
సూరజ్ రావు తండ్రి పద్మారావు అటవీశాఖ forest department లో విధులు నిర్వర్తిస్తున్నారు. అటవీశాఖ అధికారి తనయుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడటం చర్చకు దారితీసింది.
యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Indur : అధికారుల సంతాపం
నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ అధికారి ఇంట్లో విషాదం చోటుచేసుకోవడంతో ఆ శాఖ సిబ్బంది, అధికారులు పద్మారావు ఇంటికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.