ePaper
More
    Homeబిజినెస్​Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉంది.

    Wallstreet : యూఎస్‌ మార్కెట్లు (US markets)..

    వాల్‌స్ట్రీట్‌లో రికార్డులు కొనసాగుతున్నాయి. ప్రధాన ఇండెక్స్‌లు ఆల్‌టైం హై వద్ద ముగిశాయి. గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.37 శాతం, ఎస్‌అండ్‌పీ 0.27 శాతం పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.09 శాతం నష్టంతో సాగుతోంది.

    Wallstreet : యూరోప్‌ మార్కెట్లు (European markets)..

    డీఏఎక్స్‌ 0.37 శాతం తగ్గగా.. ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.23 శాతం, సీఏసీ 0.78 శాతం లాభంతో ముగిశాయి.

    Wallstreet : ఆసియా మార్కెట్లు (Asian markets)..

    ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Korea Composite Stock Price Index) 1.33 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.21 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.97 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.96 శాతం, నిక్కీ 0.44 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. షాంఘై 0.04 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ 0.22 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు పదకొండు సెషన్ల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,050 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐలు పదకొండో రోజు నికరంగా రూ. 83 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.95 నుంచి 1.08 కు పెరిగింది. విక్స్‌(VIX) 1.41 శాతం తగ్గి 10.69 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 66.91 డాలర్ల వద్ద ఉంది. ఖతార్‌లో హమాస్‌ నాయకత్వంపై ఇజ్రాయిల్‌ దాడి చేసిన తర్వాత ముడి చమురు ధరలు పెరిగాయి.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 16 పైసలు బలపడి 88.11 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.09 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.78 వద్ద కొనసాగుతున్నాయి.

    చైనాలో ఇన్ఫ్లెషన్‌(Inflation) అదుపులో ఉంది. వినియోగదారుల ధరల సూచిక గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 0.4 శాతం తగ్గింది. ఈ ఏడాది జూలైతో పోల్చితే స్థిరంగా ఉంది. అయితే ఉత్పత్తిదారుల ధరల సూచిక మాత్రం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ ప్రాతిపదికన ఆగస్టులో 2.9 శాతం, జూలైతో పోల్చితే 3.6 శాతం తగ్గింది.

    భారత్‌(Bharath)తో వాణిజ్య ఒప్పందం విషయంలో ఉన్న అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) పేర్కొన్నారు. నా మంచి మిత్రుడు మోదీతో మాట్లాడడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ఆయన ట్రుత్‌లో పోస్ట్‌ చేశారు. ఇది మన మార్కెట్లకు అనుకూలాంశం.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...