అక్షరటుడే, బాన్సువాడ:MLA Pocharam | పట్టణంలోని వాసవి హైస్కూల్(Vasavi High School) పదో తరగతి విద్యార్థిని సహస్ర 576 మార్కులతో డివిజన్ టాపర్(Division Topper)గా నిలవడంతో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం అభినందించారు. బాన్సువాడ డివిజన్ టాపర్గా నిలవడంతో వాసవి స్కూల్, తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మంచి మార్కులు సాధించడంతో యాజమాన్యం రూ. 11 వేలు బహుమతి ప్రకటించింది. కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం మోటమర్రి నాగరాజు, రామకృష్ణ, విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత, ఉపాధ్యాయులు జలీల్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.