అక్షరటుడే, బోధన్: CP Sai Chaitanya | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ ఇమేజ్ను పెంచే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ సాయిచైతన్య సూచించారు.
బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను (Bodhan Rural police Station) మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది యూనిఫాం టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్‌ను చెక్ చేశారు.
స్టేషన్లో కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో (Under investigation) ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని.. సైబర్ క్రైం (Cyber Crime) గురించి స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలని సూచించారు. రూరల్ పోలీస్‌స్టేషన్ మహరాష్ట్రకు దగ్గరగా ఉన్నందున పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
యువత బెట్టింగ్ యాప్స్ (Betting Apps) జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతికేసులో కచ్చితమైన విచారణ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని ఎస్సైలకు సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో విలేజ్ ఆఫీసర్లుగా (Village officers) పనిచేసే సిబ్బంది ప్రజలతో మమేకమై గ్రామాల్లో సమస్యలను తమ శక్తిమేర పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas), రూరల్ సీఐ విజయ్ బాబు (Rural CI Vijay Babu), బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకట నారాయణ, బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.