అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను ఎఫ్ఆర్వో చరణ్ (FRO Charan) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో సమావేశమై, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అటవీ భూముల (Forest Lands) పరిరక్షణ, వినియోగం, సాగు సౌకర్యాలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, సహకారం, రైతులకు అవకాశాలపై వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో పృథ్వీరాజ్, బీట్ ఆఫీసర్ మౌనిక, లక్ష్మయ్య పాల్గొన్నారు. అటవీ అధికారులు రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.