ePaper
More
    HomeసినిమాManisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్​లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు – పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాదిమంది గాయపడ్డారు.

    దీంతో నేపాల్(Nepal) రాజధాని ఖాట్మండు సహా పలు కీలక నగరాల్లో కర్ఫ్యూ విధించబడింది. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం(India Government) అప్రమత్తమవుతూ, నేపాల్‌లో ఉన్న భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారుల మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని విదేశాంగ శాఖ ఈ రోజు ఒక అధికారిక ప్రకటనలో సూచించింది.

    Manisha Koirala | తీవ్ర ఉద్రిక్త‌త‌లు..

    నేపాల్‌లో ఇటీవల జరిగిన ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. స్నేహపూర్వక పొరుగు దేశంగా నేపాల్‌లో శాంతి నెలకొలిపేందుకు అన్ని వర్గాలు సంయమనం పాటించాలి. చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలి అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అస‌లు నిరసనలు ఎందుకు చెలరేగాయి అంటే ‘జెన్ Z ఆందోళనలు’ పేరిట వేలాది మంది యువకులు రోడ్డెక్కడం ప్రారంభించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, ప్రభుత్వ అవినీతిని అరికట్టడంలో ప్రస్తుతం ఉన్న నేపాల్ ప్రభుత్వం (Nepal Government) పూర్తిగా విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.

    నేపాల్‌లో ఉన్న ఓలి ప్రభుత్వం భ‌ద్ర‌త కార‌ణాల‌ని సాకుగా చూపిస్తూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌లను నిషేధించింది.. ఈ నిర్ణయంపై జనం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్ర‌మంలో స్థానిక యంత్రాంగం ఖాట్మండు(Kathmandu)తో పాటు, సున్సరాయ్ జిల్లాలోని లలిత్‌పూర్ జిల్లా, పోఖారా, బుత్వాల్, ఇటాహరిల్లోనూ కర్ఫ్యూ విధించింది. అయినా, జనం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించారు.

    ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు రంగంలోకి దిగాయి. అయితే నేపాల్‌కి సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. మనీషా కోయిరాలా నేపాలీ భాష(Nepali Language)లో ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. ‘నేపాల్‌కు ఇది చీకటి రోజు. ప్రజల గొంతు, అవినీతికి వ్యతిరేకంగా కోపం, న్యాయం కోసం చేసిన డిమాండ్‌కు బుల్లెట్లతో సమాధానం ఇచ్చిన‌ రోజు’ అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా.. నేపాల్ యువతలో ఉద్రిక్తతలు, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి.. తీవ్రమైన అల్లర్లకు దారి తీస్తున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...