అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | బాన్సువాడ మండలం హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Hanmajipet Primary Health Center) మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో విద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆస్పత్రిలో సిబ్బంది విధి నిర్వాహణ, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను (medical services) పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.