అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal) మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించారు. పీహెచ్సీ సబ్‌సెంటర్ (PHC Subcenter) నిర్మాణం కోసం ఆయన హెగ్డేలి రైతు వేదిక వెనక ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
శిఖం భూమిని పరిశీలించామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు వేదిక వద్దే మరో స్థలం ఉందని గ్రామస్థులు సూచించగా ఆ స్థలాన్ని సైతం సబ్ కలెక్టర్ పరిశీలించారు.
స్థానిక తహశీల్దార్ గంగాధర్, సర్వేయర్ స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ స్థలాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, సర్వేయర్ పోశెట్టి, గ్రామ పంచాయతీ కార్యదర్శి జగదీష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.